దేశం కోసం కాదు.. సొంత ప్రతిష్ఠ కోసం ఆడుతున్నట్టుంది..: గంభీర్
- ఇంగ్లండ్ క్రికెటర్ల తీరును తప్పుబట్టిన గంభీర్
- స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వ్యాఖ్య
- గెలిపించే బ్యాటర్ ఒక్కడూ లేడంటూ విమర్శ
- శ్రీలంక బౌలింగ్ కు ప్రశంసలు
ఇంగ్లండ్ ఓటమికి ఈ రెండింటినీ కారణాలుగా గంభీర్ పేర్కొన్నాడు. ఆరంభం నుంచి ఇంగ్లండ్ బ్యాటర్ల తీరును గమనిస్తే వారికి పెద్దగా ఆసక్తి ఉన్నట్టు కనిపించడం లేదన్నాడు. మొత్తం యూనిట్ లో గెలిపించే బ్యాటర్ ఒక్కడూ లేడని వ్యాఖ్యానించాడు. ‘‘మా స్టయిల్ ఇంతే. ఎంపిక చేయడమా? లేక చేయకపోవడమా? అన్నది మీ ఇష్టం అన్నట్టు ఆటగాళ్లు వ్యవహరిస్తున్నారు. అంటే మీరు పూర్తిగా స్వార్థపరులు. బృందంగా ఆడే ఏ ఆటలో అయినా స్వార్థానికి చోటు లేదు. ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత పేరు కోసమే తప్ప, దేశం కోసం ఆడుతున్నట్టుగా లేదు’’ అని గంభీర్ విశ్లేషించాడు.
ఇంగ్లండ్ టాప్ స్కోరర్ బెన్ స్టోక్స్ పైనా గంభీర్ విమర్శలు చేశాడు. దూకుడుగా బ్యాటింగ్ చేయడాన్ని తప్పుబట్టాడు. 48, 49వ ఓవర్ వరకు బ్యాటింగ్ పై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ప్రస్తావించాడు. ‘‘మొదటి ఏడు ఓవర్లను గమనిస్తే ఇంగ్లండ్ జట్టు 350 లేదా 400 స్కోర్ చేస్తుందన్నట్టుగా అనిపించింది. జోరూట్ అవుటైన తర్వాత ఏ ఒక్కరూ విజయం కోసం ఆడినట్టుగా లేదు’’ అని పేర్కొన్నాడు.