రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు... డీజీపీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ బహిష్కృత నేత
- రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందన్న కురువ విజయ్ కుమార్
- డీజీపీ సానుకూలంగా స్పందించారన్న నేత
- కాంగ్రెస్ కోసం అహర్నిశలు పని చేస్తే వేరేవాళ్లకు గద్వాల టిక్కెట్ ఇచ్చారని ఆగ్రహం
- రేవంత్ రెడ్డి టిక్కెట్లను అమ్ముకున్నారని ఆరోపణలు
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్లను డబ్బులకు, భూములకు అమ్ముకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకోకపోతే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ కారణంగానే రేవంత్ అనుచరులు తమను వేధిస్తున్నారన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశామని, పదిహేనేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నామన్నారు. అలాంటి తనను ఇవాళ అకారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన తమను అణగదొక్కడానికి రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.