కొండగట్టు సందర్శన వాయిదా.. నేరుగా ఆర్ముర్ కి రాహుల్
- కొండగట్టు సందర్శన వాయిదా.. నిజామాబాద్‌లో పాదయాత్ర రద్దు
- సాయంత్రం ఢిల్లీ వెళ్లాల్సి ఉండడమే కారణం
- వెల్డడించిన కాంగ్రెస్ వర్గాలు
కాగా ఉదయం షెడ్యూల్ ప్రకారం.. కరీంనగర్‌లోని వీపార్క్ హోటల్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయల్దేరారు. చొప్పదండి నియోజకవర్గం చేరుకోనున్నారు. ఉదయం 11 గంటలకు జగిత్యాలలో కార్నర్ మీటింగ్, మధ్యాహ్నం 12 గంటలకు వేములవాడ నియోజకవర్గంలో సమావేశం, 1 గంటకు వేములవాడలో కార్యక్రమాలతో రాహుల్ బిజీగా గడపనున్నారు. కోరుట్లలో మధ్యాహ్నం కార్నర్ మీటింగ్ తర్వాత భోజనం చేస్తారు. కాగా రాహుల్ పర్యటన నిమిత్తం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాట్లు చేశాయి. రాహుల్ సభల్లో జనాలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా జనసమీకరణపై నేతలు దృష్టిసారించారు.