అయోధ్య ఆలయంలో పూజారి దారుణ హత్య.. గొంతుకోసి చంపిన దుండగులు
- ప్రఖ్యాత హనుమాన్ గర్హి ఆలయంలో దారుణ ఘటన
- రామజన్మభూమి ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్ లో హత్య
- శిష్యులే హత్య చేసి ఉండొచ్చని అనుమానాలు
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయనను గొంతు కోసి హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదయం 7 గంటలకు ఈ దారుణం జరిగినట్టు పోలీసులకు సమాచారం అందింది. పూజలు నిర్వహించడానికి రామ్ సహరే రాకపోవడంతో తోటి పూజారులు వెళ్లి ఆయన కోసం వెతుకుతుండగా ఆయన మృతదేహం కనిపించింది. దుండగులు పదునైన ఆయుధంతో దాడి చేశారని పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. నిన్న రాత్రి పూజారికి, ఆయన శిష్యులకు మధ్య ఘర్షణ జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
పూజారి శిష్యులే ఈ హత్య చేసి ఉండొచ్చనే ఆరోపణలు వినిపిస్తుండటంతో వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులు విచారిస్తున్నారు. మరో శిష్యుడు పరారయ్యాడు. అతన్ని పట్టుకోవడం కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.