Rohit Sharma: టీమిండియాలో నెక్స్ట్ ధోనీ ఇతనే: సురేశ్ రైనా

Next Dhoni in Team India is Rohit Sharma says Suresh Raina
  • రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని కితాబునిచ్చిన రైనా
  • డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ ను తోటి ఆటగాళ్లు ఎంతో గౌరవిస్తారని వెల్లడి
  • టీమ్ లో నెక్స్ట్ ధోనీ రోహిత్ అని వ్యాఖ్య

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ క్రికెటర్ సురేశ్ రైనా ప్రశంసలు కురిపించాడు. రోహిత్ ఒక గొప్ప బ్యాట్స్ మెన్ అని కితాబునిచ్చాడు. గతంలో కెప్టెన్ గా ధోనీకి టీమ్ సభ్యుల్లో ఎంతో గౌరవం ఉండేదని... ఇప్పుడు అలాంటి గౌరవమే రోహిత్ కు లభిస్తోందని చెప్పాడు. సహచర ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడని... తాను కూడా గతంలో రోహిత్ తో డ్రెస్సింగ్ రూమ్ ని షేర్ చేసుకున్నానని తెలిపాడు. 

రోహిత్ చాలా కూల్ గా ఉంటాడని... ప్రతి ఆటగాడి అభిప్రాయాలను శ్రద్ధగా వింటాడని రైనా చెప్పాడు. ఫామ్ లో లేని ప్లేయర్లలో కూడా నమ్మకాన్ని నింపి, వాళ్లు బాగా ఆడేలా చేస్తాడని తెలిపాడు. టీమ్ ను ముందుండి నడిపించేందుకు ఇష్టపడతాడని చెప్పాడు. ప్లేయర్ గా కూడా రోహిత్ అద్భుత ప్రదర్శన చేస్తాడని... కెప్టెన్ బాగా ఆడితే డ్రెస్సింగ్ రూమ్ లో అతనిపై గౌరవం ఆటోమేటిక్ గా పెరుగుతుందని అన్నాడు. టీమిండియాలో నెక్స్ట్ ధోనీ ఎవరని తనను ఎవరైనా అడిగితే... తాను రోహిత్ శర్మ పేరే చెపుతానని వ్యాఖ్యానించారు. ఇండియన్ టీమ్ లో మరో ధోనీ రోహిత్ అని అన్నాడు.

  • Loading...

More Telugu News