హీరో అజిత్ సినిమా షూటింగ్ లో విషాదం... ఆర్ట్ డైరెక్టర్ మృతి
- 'విడా ముయార్చి' చిత్రంలో నటిస్తున్న అజిత్
- ప్రస్తుతం అజర్ బైజాన్ లో షూటింగ్
- గుండెపోటుతో కన్నుమూసిన ఆర్ట్ డైరెక్టర్ మిలాన్
- తీవ్ర విషాదంలో చిత్ర యూనిట్
చిత్రీకరణ సాగుతున్న సమయంలో మిలాన్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు డాక్టర్లు తెలిపారు.
మిలాన్ గతంలో అజిత్ నటించిన బిల్లా, వేదాళం చిత్రాలకు కూడా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. మిలాన్ మృతితో 'విడా ముయార్చి' చిత్రయూనిట్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది.