చిలిపి పనులు, పిచ్చి చేష్టలు చేయకండి: సీఎం కేసీఆర్
- నోరు అదుపులో పెట్టుకోవాలంటూ అభ్యర్థులకు వార్నింగ్
- అహంకారం వల్లే గతంలో జూపల్లి ఓడిపోయారన్న కేసీఆర్
- అలకలు పక్కన పెట్టాలంటూ అభ్యర్థులకు క్లాస్ తీసుకున్న బీఆర్ఎస్ చీఫ్
ప్రజలు, కార్యకర్తలతో మాట్లాడేటపుడు నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పారు. అలకలు పక్కన పెట్టి అందరితో కలిసి పనిచేయాలని సూచించారు. ఈ ఎన్నికల ప్రచారానికి సోమ భరత్ కుమార్ ను సమన్వయకర్తగా నియమించినట్లు కేసీఆర్ చెప్పారు. ఏదైనా సమస్య ఎదురైతే 98480 23175 నంబర్‌కు ఫోన్ చేయాలని.. భరత్ కుమార్ 24 గంటలు అందుబాటులో ఉంటారని అభ్యర్థులకు సూచించారు.
జూపల్లి కృష్ణారావు ఉదంతాన్ని కేసీఆర్ ప్రస్తావిస్తూ.. జూపల్లి కృష్ణారావు అని ఒకాయన ఉండే.. మంత్రిగా కూడా పని చేశారు. అయినా అహంకారంతో వ్యవహరించారు. ఇతర నాయకులతో మాట్లాడలేదు. దీంతో 2018 ఎన్నికల్లో ఓడిపోయారని చెప్పారు. ఒక మనిషితో మాట్లాడేందుకు అహంకారం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతంగా మనవి చేస్తున్నానంటూ.. ఈ ముఖ్యమైన సమయంలో మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు.