Rohit Sharma: భారీ సిక్స్ బాదాక రోహిత్ శర్మ పట్టరాని సంబరం.. అంపైర్‌వైపు చూసి కండల ప్రదర్శన

Rohit Sharma flexes his muscles to umpire Marais Erasmus after hitting 90m six off Haris Rauf
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్‌తో నిన్న జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. 63 బంతుల్లో 86 రన్స్‌తో భారత్ విజయానికి బాటలు పరిచాడు. ఈ ఇన్నింగ్స్‌‌లో ఏకంగా ఆరు సిక్సులు బాదడంతో అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియం దద్దరిల్లింది. అయితే, ఎనిమిదో ఓవర్‌లో రోహిత్, కవర్స్ మీదుగా బాదిన సిక్స్ ఏకంగా 90 మీటర్ల దూరానికి వెళ్లింది. 

మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచిన ఈ సిక్స్‌ను చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ఇక తన సిక్స్ చూసుకుని రోహిత్ శర్మలో కూడా ఆనందం కట్టలు తెంచుకుంది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ తన సామర్థ్యం ఇదీ అని సూచించేలా అంపైర్‌కు సరదాగా తన చేతి కండలను ప్రదర్శించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ దృశ్యం కూడా రోహిత్ అభిమానులను, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది.
Go Back to Shorts
Rohit Sharma

More Telugu News