కోర్టు హాలులో చంద్రబాబు, సీఐడీ న్యాయవాదుల మధ్య మాటల యుద్ధం.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి
- కాల్ డేటా రికార్డులపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
- చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్
- సీఐడీ తరఫున వాదనలు వినిపించిన వివేకానంద
- ఈ క్రమంలో ఇరువైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం
సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ రోజు ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్ వేసి నెల రోజులైందని, త్వరగా విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. అసలు ఈ పిటిషన్ అనర్హమైనదని సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద వాదించారు. ఈ క్రమంలో ఇరువైపుల న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.