నర్సు స్నానం చేస్తుండగా వీడియో తీసిన పోలీసు
- ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో ఘటన
- తను స్నానం చేస్తుండగా పోలీసు కానిస్టేబుల్ రికార్డు చేశాడని నర్సు ఆరోపణ
- నిందితుడిని గుర్తించి కెమెరా ఇవ్వమంటే పారిపోయినట్టు వెల్లడి
- పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
నిందితుడు తన పొరుగింట్లో ఉంటాడని, అతడు తన సహోద్యోగి భర్తే అని ఆమె చెప్పింది. ఆ రోజు ఉదయం తాను స్నానం చేసి దుస్తులు ధరిస్తూ పైకి చూడగా ఓ కెమెరా కనిపించిందని చెప్పింది. వెంటనే తాను బాత్రూమ్ బయటకు వచ్చి చూడగా పొరుగింటికి లోపలి నుంచి గొళ్లెం పెట్టి ఉందని చెప్పింది. అక్కడే ఉన్న ఓ మహిళను తలుపులు తెరవమని చెప్పి లోపలికి వెళ్లి చూడగా నిందితుడు కనిపించాడని పేర్కొంది. తాను అతడిని సెల్‌ఫోన్ చూపించమని కోరగా నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని చెప్పింది. ఆ వెంటనే ఆమె సివిల్ పోలీస్ లైన్స్‌లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది.