Ram Charan: రామ్ చరణ్-శంకర్ 'గేమ్ చేంజర్' కొత్త షెడ్యూల్ ప్రారంభం

Ram Charan Game Changer new schedule begins in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సౌతిండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం... గేమ్ చేంజర్. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో శంకర్ ట్రేడ్ మార్క్ స్టోరీతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 

కాగా, ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఓ భావోద్వేగ భరిత సన్నివేశానికి సంబంధించిన చిత్రీకరణ హైదరాబాదులో షురూ అయింది. నిన్నటి నుంచి ఈ సీన్ ను షూట్ చేస్తున్నట్టు చిత్రబృందం వెల్లడించింది.

కాగా, దర్శకుడు శంకర్ కూడా తాజా షెడ్యూల్ పై సోషల్ మీడియాలో అప్ డేట్ ఇచ్చారు. నిన్నటి నుంచి హైదరాబాదులో మా గేమ్ చేంజర్ కు సంబంధించి ఓ భావోద్వేగ భరిత సన్నివేశానికి నగిషీలు చెక్కుతున్నాం అని శంకర్ వివరించారు. ఈ మేరకు ఓ వర్కింగ్ స్టిల్  ను కూడా పంచుకున్నారు.
Go Back to Shorts
Ram Charan
Game Changer
New Schedule
Hyderabad
Shankar
Dil Raju
SVC

More Telugu News