చెల్లెమ్మా పురందేశ్వరీ.. మీకు అంత ప్రయాస ఎందుకు?: విజయసాయిరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెల్లెమ్మా పురందేశ్వరీ.. మీకు అంత ప్రయాస ఎందుకు?: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on Purandeswari
  • పురందేశ్వరి ఢిల్లీ పర్యటనపై విజయసాయి విమర్శలు
  • రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల కోసం ఢిల్లీకి వెళ్తే బాగుండేదని వ్యాఖ్య
  • అరెస్టై చంద్రబాబు కోసం అంత ప్రయాస ఎందుకని ఎద్దేవా
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఢిల్లీ పర్యటనపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'ఏపీకి రావాల్సిన ప్రాజెక్టుల కోసమో లేదా కనీసం మీ పార్టీ అభివృద్ధి కోసమో ఢిల్లీ యాత్రలు చేస్తే బాగుండేదేమో చెల్లెమ్మా పురందేశ్వరి' అని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి చేసి అరెస్టైన మీ బావ చంద్రబాబు కోసం ప్రయాస ఎందుకని అన్నారు. ఒక జాతీయ పార్టీలో ఉన్నానన్న కనీస స్పృహ లేకుండా మీరు చేస్తున్న డిమాండ్లను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. 
Advertisement
Vijayasai Reddy
YSRCP
Daggubati Purandeswari
BJP
Chandrababu
Telugudesam

More Telugu News