గగన్‌యాన్ మిషన్.. త్వరలో క్రూ ఎస్కేప్ వ్యవస్థను పరీక్షించనున్న ఇస్రో
- ఫ్లైట్ టెస్ట్ అబార్ట్ మిషన్ పేరిట త్వరలో ఇస్రో కీలక పరీక్ష
- అత్యవసర సందర్భాల్లో వ్యోమగాములను సురక్షితంగా భూమికి చేర్చే క్రూ ఎస్కేప్ వ్యవస్థను పరీక్షించనున్న ఇస్రో
- ఈ ప్రయోగం ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నట్టు వెల్లడి
ఈ క్రమంలో రాకెట్ నుంచి విడివడే క్రూ మాడ్యుల్ పారాషూట్ల సాయంతో బంగాళాఖాతంలో దిగుతుంది. ఈ సందర్భంగా వ్యోమగాముల రక్షణకు ఏర్పాటు చేసిన వ్యవస్థల పనితీరును మాడ్యూల్‌లోని వివిధ పరికరాలతో శాస్త్రవేత్తలు సేకరిస్తారు. క్రూ మాడ్యూల్‌ను స్వాధీనం చేసుకున్నాక అందులోని డాటా ఆధారంగా మరిన్ని మెరుగులు దిద్దుతారు. త్వరలో ఫ్లైట్ టెస్ట్ అబార్ట్ మిషన్ చేపడతామని ఇస్రో తాజాగా వెల్లడించింది.