Uttar Pradesh: 5 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం..ఆపై ఆత్మహత్య

UP man violates 5 year old girl
షార్ట్స్‌లో చూడండి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో తాజాగా దారుణం వెలుగులోకి వచ్చింది. అన్నెంపున్నెం ఎరుగని ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి ఎంతసేపటికీ లోపలికి రాకపోవడంతో కుటుంబసభ్యులకు సందేహం వచ్చింది. వారు చుట్టుపక్కల అంతా వెతికే క్రమంలో నిందితుడు మహ్మద్ ఇంట్లోకి వెళ్లగా అక్కడ దారుణ దృశ్యం కనిపించింది. 

బాలిక కుటుంబసభ్యులను చూడగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తమోడుతున్న బిడ్డను ఆసుపత్రికి తరలించాక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా మహమ్మద్ ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. పోలీసులకు భయపడో లేక పశ్చాత్తాపం వల్లనో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
Uttar Pradesh
Crime News

More Telugu News