రూ.2000 నోట్లను డెడ్‌లైన్ తర్వాత కూడా మార్చుకోవచ్చు.. ఎక్కడంటే..!
- రేపటితో ముగియనున్న రూ.2000 నోటు మార్పిడి గడువు
- అక్టోబర్ 8 నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చునన్న ఆర్బీఐ
- తపాలా శాఖ సేవలను కూడా వినియోగించుకోవచ్చునని స్పష్టీకరణ
రూ.2వేల నోట్ల మార్పిడి గడువును తొలుత సెప్టెంబర్ 30 వరకు ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 7 వరకు పొడిగించారు. అయితే 8వ తేదీ నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దాదాపు ప్రతి రాష్ట్ర రాజధానిలోను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. తపాలా శాఖ సేవలను కూడా వినియోగించుకోవచ్చునని చెప్పారు.