సిరియా మిలటరీ అకాడమీపై డ్రోన్ దాడి.. 100 మందికిపైగా మృతి
- అకాడమీలో జరుగుతున్న ఆఫీసర్స్ గ్రాడ్యుయేషన్ వేడుకపై దాడి
- మరో దాడిలో 9 మంది మృతి
- ఇప్పటి వరకు బాధ్యత ప్రకటించని ఉగ్ర సంస్థలు
ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి హసన్ అల్ ఘోబాష్ ప్రభుత్వ టీవీతో మాట్లాడుతూ.. ప్రాథమికంగా మృతుల సంఖ్య 80గా పేర్కొన్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, అంతే సంఖ్యలో చిన్నారులు ఉన్నట్టు తెలిపారు. 240 మంది వరకు గాయపడినట్టు పేర్కొన్నారు. ఈ దాడికి ఏ సంస్థ ఇప్పటి వరకు బాధ్యత ప్రకటించలేదు.
పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్‌తో ఈ దాడి జరిగింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం నేటి నుంచి మూడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. కాగా, టర్కీ-సిరియా మధ్య 2016-2019 మధ్య ఉత్తర సిరియాలోని కుర్దిష్ దళాలపై టర్కీ మూడు మేజర్ ఆపరేషన్స్ నిర్వహించింది. సిరియాలో ఈ ఘర్షణల కారణంగా 2011 నుంచి ఇప్పటివరకు 5 లక్షల మంది వరకు చనిపోయారు.