చిలుక కనిపించడం లేదని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు.. ఒక్క రోజులో వెతికితెచ్చిన పోలీసులు
- రూ.1.30 లక్షల విలువైన ఆస్ట్రేలియా చిలుక పోయిందని జూబ్లీహిల్స్ వ్యాపారి ఫిర్యాదు
- చిలుక ఫొటోను స్థానిక పెట్ షాపు నిర్వాహకులకు పంపించిన పోలీసులు
- ఆ చిలుక అమ్మకానికి ఉందని ఓ వ్యక్తి పెట్టిన వాట్సాప్ స్టేటస్‌తో జాడ లభ్యం
- పెట్ షాప్ నిర్వాహకుడు ఇచ్చిన సమాచారంతో చిలుకను స్వాధీనం చేసుకున్న వైనం
సెప్టెంబర్ 24న నరేంద్రాచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చిలుక ఫొటో కూడా వారికి ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఫొటోను స్థానిక పక్షులు, జంతువుల విక్రయదారులకు పంపించారు. అయితే, అప్పటికే ఈ చిలుక రెండు సార్లు చేతులు మారింది. మూడోమారు ముజీబ్ అనే వ్యక్తి రూ.70 వేలకు చిలుకను అమ్మకానికి పెట్టాడు. చిలుక ఫొటోను వాట్సాప్ స్టేటస్‌లో పెట్టాడు. జూబ్లీహిల్స్‌లోని ఓ పెట్ షాపు యజమాని ఈ విషయాన్ని ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతోతెలియజేయడంతో వారు చిలుకను స్వాధీనం చేసుకున్నారు.