Rs.2000: రూ.2000 నోట్లు మార్చుకునేందుకు గడువు పెంచిన ఆర్బీఐ... వివరాలు ఇవిగో!

RBI extends timeline to exchange and deposit Rs 2000 notes
షార్ట్స్‌లో చూడండి
గతంలో తీసుకువచ్చిన రూ.2000 కరెన్సీ నోట్లను ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు, లేదా మార్కెట్లో మార్చుకునేందుకు సెప్టెంబరు 30వ తేదీని గడువుగా విధించింది. 

అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆ గడువును కొన్నిరోజుల పాటు పొడిగించింది. అక్టోబరు 7వ తేదీ వరకు రూ.2000 నోట్లను మార్చుకునేందుకు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గడువు పొడిగించిన నేపథ్యంలో, అక్టోబరు 7 వరకు రూ.2000 నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.

ఆర్బీఐ ప్రకటనలోని ముఖ్యాంశాలు...

  • అక్టోబరు 8 నుంచి రూ.2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, మార్చుకోవడానికి ఎంతమాత్రం అనుమతించరు. 
  • అక్టోబరు 8 నుంచి... వ్యక్తులు కానీ, సంస్థలు కానీ 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక్కసారికి రూ.20 వేల వరకే మార్చుకునేలా పరిమితి విధించారు. 
  • నిర్దేశిత 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు కానీ, సంస్థలు కానీ రూ.2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేసుకోవచ్చు. 
  • వ్యక్తులు కానీ, సంస్థలు కానీ తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను నిర్దేశిత ఆర్బీఐ కార్యాలయాలకు పోస్టులో పంపడం ద్వారా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. 
  • ఈ లావాదేవీలన్నీ ప్రభుత్వ, ఆర్బీఐ నిబంధనలకు లోబడి జరుగుతాయి. ప్రజలు తమ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, నిర్దిష్ట విధివిధానాలను పాటించాల్సి ఉంటుంది. 
  • ఇక, కోర్టులు, దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, ఇతర ప్రభుత్వ వర్గాలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఎలాంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ కేంద్రాల్లో డిపాజిట్ చేయవచ్చు.

Go Back to Shorts
Rs.2000
RBI
Deadline
Extension
India

More Telugu News