వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులకు మెట్రో రైల్ శుభవార్త
- గురువారం అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపనున్నట్లు వెల్లడి
- రాత్రి ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరి, రెండు గంటలకు చివరి స్టేషన్ చేరుకుంటుందని వెల్లడి
- 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో కార్యకలాపాలు
ఖైరతాబాద్, లక్డీకాపూల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రయివేట్ సెక్యూరిటీని మోహరించినట్లు తెలిపారు. డిమాండ్‌ను బట్టి కొన్ని మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు, అదనంగా రైళ్లు నడపనున్నట్లు వివరించారు. మళ్లీ 29న ఉదయం 6 గంటలకు యథాతథంగా మెట్రో కార్యకలాపాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.