వైసీపీ నేతలే జగన్ ను అసహ్యించుకుంటున్నారు: నన్నపునేని రాజకుమారి
- జనంలోకి ఎలా వెళ్లాలంటూ తలపట్టుకుంటున్నారన్న రాజకుమారి
- పదిమంది దోషులు తప్పించుకున్నా సరే ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదని వ్యాఖ్య
- హైటెక్ సిటీ నిర్మించి చంద్రబాబు ఆకాశమంత ఎత్తు ఎదిగారన్న నన్నపునేని
పదిమంది దోషులనైనా వదిలిపెట్టొచ్చు కానీ ఒక్క నిర్దోషిని కూడా శిక్షించవద్దని న్యాయ శాస్త్రంలోనూ ఉందని నన్నపునేని రాజకుమారి చెప్పారు. అదేవిధంగా పదిమంది తెలివితక్కువ వారిని నిర్లక్ష్యం చేసినా పర్వాలేదు కానీ ఒక మేధావిని నిర్లక్ష్యం చేయకూడదని పెద్దలు చెబుతుంటారని వివరించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు అందించిన సేవలు మన రాష్ట్రానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆ రోజుల్లో హైటెక్ సిటీ నిర్మించి చంద్రబాబు ఆకాశమంత ఎత్తు ఎదిగారని చెప్పారు. అదేవిధంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు తపన పడుతున్నారని రాజకుమారి వివరించారు.