Swara Bhaskar: పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి స్వరా భాస్కర్

Bollywood actress Swara Bhaskar gives birth to baby
  • సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ అహ్మద్ ను పెళ్లాడిన స్వరా భాస్కర్
  • ఈ నెల 23న కూతురు జన్మించినట్టు ప్రకటించిన స్వర
  • కూతురుకి రుబియా అనే పేరు పెడుతున్నట్టు వెల్లడి

బాలీవుడ్ సినీ నటి స్వరా భాస్కర్ తల్లి అయ్యారు. పండంటి ఆడబిడ్డకు ఆమె జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వర, ఆమె భర్త ఫహాద్ అహ్మద్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. బిడ్డతో కలసి ఉన్న ఫొటోను వారు షేర్ చేశారు. ఈ నెల 23న తమకు కూతురు జన్మించిందని స్వరా భాస్కర్ వెల్లడించింది. ఆమెకు రుబియా అనే పేరు పెడుతున్నట్టు తెలిపింది. స్వర దంపతులకు బిడ్డ జన్మించిన నేపథ్యంలో అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

స్వర భర్త ఫహాద్ అహ్మద్ సమాజ్ వాదీ పార్టీ నేత కావడం గమనార్హం. 2023 జనవరి 6న వీరు పెళ్లి చేసుకున్నారు. వీరు తొలుత కోర్టు ద్వారా రహస్య వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత మార్చిలో మరోసారి పెళ్లి చేసుకున్నారు. తాను తల్లిని కాబోతున్నట్టు మార్చిలో ఆమె ప్రకటించారు. బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

  • Loading...

More Telugu News