రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబ పరామర్శలో సింపతీ ఏరులై పారేలా రక్తికట్టిస్తున్నారు: విజయసాయిరెడ్డి
- సింపతీని రక్తి కట్టించేందుకు డబ్బిచ్చి జనాల్ని తీసుకొస్తున్నారని ఆరోపణ
- టీడీపీకి ఇది కొత్త ఏమీ కాదని చురకలు
- డబ్బు వెదజల్లితే ఏ పని అయినా జరిగిపోతుందని ఆ పార్టీ నమ్మకమని వ్యాఖ్య
తప్పు చేయకపోతే, సాక్ష్యాలు లేకపోతే చంద్రబాబు, లోకేశ్ సన్నిహితులు ఒక్కొక్కరూ విదేశాలకు ఎందుకు పారిపోయారు? అని అంతకుముందు ఓ ట్వీట్‌లో ప్రశ్నించారు. అడ్డంగా దొరికిపోయామని వారిని దేశం దాటించిన వారికి తెలుసు అన్నారు. ఎన్నికల తర్వాత టీడీపీది పూర్తిగా పలాయనవాదమేనని పేర్కొన్నారు.