Jagan: గడప గడపకు కార్యక్రమంపై రేపు జగన్ సమీక్ష.. వైసీపీ ఎమ్మెల్యేలలో హై టెన్షన్

  • తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సమీక్ష
  • ఎమ్మెల్యేల పనితీరుపై జగన్ కు ఇప్పటికే అందిన నివేదిక
  • ఎమ్మెల్యేల పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్న జగన్
CM YS Jagan To Review Gadapa Gadapaku Mana Prabutvam

వైసీపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి జగన్ రేపు సమీక్ష నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ఆయన సమావేశం కానున్నారు. గడప గడపకు కార్యక్రమంలో వీరి పని తీరుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 

ఈ కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ఇప్పటికే జగన్ కు నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో, ఎమ్మెల్యేల భవిష్యత్తు రేపు తేలిపోనుందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలలో టెన్షన్ పెరిగిపోతోంది. కొంత మంది ఎమ్మెల్యేలు గడప గడపకు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేసినప్పటికీ... 60 నుంచి 70 శాతం మాత్రమే పూర్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాదిన్నర గడుస్తున్నా టార్గెట్ ను పూర్తి చేయని వారిపై జగన్ అసంతృప్తితో ఉన్నారని చెపుతున్నారు.

More Telugu News