యూపీలో 5 ఏళ్ల బాలికపై 7 ఏళ్ల బాలుడి అత్యాచారం!
- ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహాత్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
- తన కూతురిని అత్యాచారం చేశాడంటూ పొరుగింటి బాలుడిపై మహిళ ఆరోపణ
- పిల్లలిద్దరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారం జరిగినట్టు వెల్లడి
- ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ నేపథ్యంలో బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం ఐపీసీ సెక్షన్ 376, పోక్సో చట్టంలోని సెక్షన్ 5/6 కింద కేసు నమోదు చేశారు. అయితే, ఐపీసీలోని సెక్షన్ 82 ప్రకారం ఏడేళ్లలోపు చిన్నారులు చేసే ఏ చర్యను నేరంగా పరిగణించరాదు. దీంతో, ఈ కేసు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో న్యాయనిపుణుల సలహా ఆధారంగా ముందుకెళతామని పేర్కొన్నారు.