మతాల మధ్య చిచ్చుపెట్టేలా సబ్సిడీ పథకంపై అవాస్తవ కథనాలు.. ఆజ్‌తక్ ఎడిటర్ సుధీర్ చౌదరిపై కర్ణాటక కాంగ్రెస్ కేసు
- మైనార్టీల కోసం సారథి పథకం తీసుకొచ్చిన కర్ణాటక ప్రభుత్వం
- హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేలా సుధీప్ చౌదరి కథనం ఉందంటూ ఫిర్యాదు
- కోర్టులో తేల్చుకుందామన్న సుధీర్ చౌదరి
ఈ కేసుపై సుధీర్ చౌదరి ఎక్స్ ద్వారా స్పందించారు. పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం తనపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టడం చూస్తుంటే తన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేసినట్టుగా ఉందన్నారు. సారథి పథకంలో హిందువులను ఎందుకు చేర్చలేదన్నదే తన ప్రశ్న అన్న ఆయన కోర్టులో కలుసుకుందామని స్పష్టం చేశారు.