Komatireddy Venkat Reddy: కేటీఆర్... పెద్ద  పెద్ద మాటలు మాట్లొడొద్దు: కోమటిరెడ్డి

Komatireddy take a jibe at KTR
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ పేరుతో కేటీఆర్ లక్షల కోట్లు వెనకేసుకున్నాడని అన్నారు. కేటీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. 

"సోనియా గాంధీపైనా, కాంగ్రెస్ పైనా నోరు పారేసుకోవద్దని కేటీఆర్ కు చెబుతున్నాం. నాడు సోనియాతో గ్రూప్ ఫొటో కూడా దిగావు కదా కేటీఆర్. ఇంకోసారి సోనియాపై మాట్లాడితే పాపం తగులుతుంది. కేటీఆర్... రాజకీయాల్లో నీకేం అనుభవం ఉంది. తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అయినప్పుడు నువ్వు అమెరికాలో ఉన్నావ్. రెండో దశ ప్రారంభం కాగానే వచ్చావ్. కేసీఆర్ దీక్ష చూసి తెలంగాణ రాలేదని కేటీఆర్ తెలుసుకోవాలి.

ఇవాళ కేటీఆర్ వెనుక ఉన్నదంతా తెలంగాణ ద్రోహులే. తలసాని, మహేందర్ రెడ్డి, సబిత వీళ్లందరూ తెలంగాణ ద్రోహులు కారా? తెలంగాణ ఉద్యమకారులపై చేయిచేసుకున్న వ్యక్తి దానం నాగేందర్. పూలు, పాలు అమ్ముకున్నానని చెప్పే మల్లారెడ్డి భూములు కూడా అమ్ముకున్నారు. పువ్వాడ అజయ్ కి తెలంగాణ ఉద్యమానికి ఏమైనా సంబంధం ఉందా? 

ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనం,  టీఎస్ పీఎస్సీ పరీక్షల నిర్వహణ చేతకాదు కానీ మాపై మాట్లాడితే ఎలా కేటీఆర్? కాంగ్రెస్ 20 ఏళ్ల కిందటే ఒకే ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇచ్చింది... ఆ రోజుల్లో రూ.400 అంటే చిన్న మొత్తమేమీ కాదు. అప్పట్లో కాంగ్రెస్ 32 లక్షల ఇళ్లు కట్టించింది. మీ ముఖానికి 30 వేల ఇళ్లయినా కట్టారా? కాళేశ్వరం ప్రాజెక్టును కూడా డబ్బుల కోసం కట్టారు" అంటూ కోమటిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు.
Go Back to Shorts
Komatireddy Venkat Reddy
KTR
Sonia Gandhi
Congress
KCR
BRS
Telangana

More Telugu News