రెండ్రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్లో చేరిన ‘జవాన్’
- మరో భారీ హిట్ సొంతం చేసుకున్న షారుక్ ఖాన్
- అట్లీ దర్శకత్వంలో గురువారం విడుదలైన సినిమా
- రూ. 305 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రం
ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు రెండో రోజు 'జవాన్' భారత్ లో అన్ని భాషల్లో కలిపి రూ. 53 కోట్లు రాబట్టింది . హిందీ బెల్ట్‌లో మొత్తం 42.51 శాతం ఆక్యుపెన్సీని సాధించింది. కాగా, ఈ చిత్రం దాదాపు 305 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. నార్త్ ఇండియాలో రూ. 135 కోట్లు, సౌత్ ఇండియాలో రూ. 65 కోట్లు, ఓవర్సీస్ లో మరో 105 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 175 కోట్ల నెట్ వసూళ్లు చేయాల్సి ఉంది. జవాన్ దూకుడు చూస్తుంటే తొలివారంలోనే రూ. 500 కోట్లు రాబట్టి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది.