వరుసగా ఐదో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Stock Markets ends in profits for 5th straight day
  • 385 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 116 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 4.26 శాతం పెరిగిన ఎల్ అండ్ టీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాల్లో ముగిశాయి. వరుసగా ఐదో సెషన్లో కూడా లాభపడ్డాయి. ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు ఒడిదుడుకులకు గురైనప్పటికీ... మధ్యాహ్నం నుంచి కొనుగోళ్ల  మద్దతు లభించింది. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 385 పాయింట్లు లాభపడి 66,265కి పెరిగింది. నిఫ్టీ 116 పాయింట్లు పుంజుకుని 19,727 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (4.26%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.26%), టెక్ మహీంద్రా (1.69%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.55%) హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.49%). 

టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-0.88%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.74%), ఇన్ఫోసిస్ (-0.73%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.60%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.59%).
Go Back to Shorts
Stock Market
Sensex
Nifty

More Telugu News