వామ్మో పులస.. రూ.26 వేలకు కొన్న రాజకీయ నాయకుడు!
- యానాం పుష్కరఘాట్ వద్ద మత్స్యకారుడి వలకు చిక్కిన పులస
- వేలంలో రూ. 19 వేలకు దక్కించుకున్న మహిళ
- ఆ తర్వాత ఆమె నుంచి ఓ రాజకీయ నాయకుడి కోసం కొనుగోలు
ఆ తర్వాత రావులపాలెంకు చెందిన ప్రముఖ నాయకుడి కోసం ఓ వ్యక్తి ఆమె నుంచి రూ. 26 వేలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్‌లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. గోదావరికి ఎదురీదే పులస అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతారు. దీనికి తోడు ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ చేపను కొనేందుకు పోటీపడుతుంటారు.