తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తమన్నా

Tamannah comments on marriage
  • వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందన్న తమన్నా
  • ప్రస్తుతం తనకు పెద్ద ఆఫర్లు వస్తున్నాయని వెల్లడి
  • పెళ్లి ఆలోచనకు ముగింపు పలికానని వ్యాఖ్య
సినీ పరిశ్రమలో అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తవుతున్నా తమన్నా జోరు మాత్రం ఇంకా తగ్గలేదు. వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆమె చాలా బిజీగా ఉంది. మరోవైపు సినీ నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉంది. ఇటీవలే వీరిద్దరూ మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లొచ్చారు. మరోవైపు అన్ని చోట్ల తమన్నాకు పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. 

తాజాగా తన పెళ్లి గురించి తమన్నా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భారతీయ వివాహ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కొన్నాళ్ల క్రితం అనుకున్నానని... అయితే, కెరీర్ బిజీగా మారడంతో పెళ్లి ఆలోచనకు ముగింపు పలికానని చెప్పింది. ప్రస్తుతం పెద్ద ఆఫర్లు వస్తున్నాయని... అందువల్ల తన పెళ్లి వార్త వినాలంటే చాలా రోజులు ఎదురు చూడాల్సిందేనని తెలిపింది.
Advertisement
Tamannaah
Tollywood
Hollywood
Marriage

More Telugu News