తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ
- మరో విడత డీఏను పెంచుతున్నట్లు ప్రకటించిన చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి
- జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న 5 శాతం డీఏను మంజూరు చేయాలని నిర్ణయం
- ఇప్పటి వరకు 8 డీఏలు మంజూరు చేసినట్లు వెల్లడించిన బాజిరెడ్డి
క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటి వరకు ఎనిమిది డీఏలను మంజూరు చేసినట్లు బాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారని, పెండింగ్ బకాయిలను త్వరలో ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోందన్నారు.