సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు బీజేపీ ఎమ్మెల్యే ఆశావహుల దరఖాస్తుల స్వీకరణ
- దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించిన కిషన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ
- నాంపల్లి బీజేపీ కార్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ
- ఉదయం 10 నుండి సాయంత్రం 4 వరకు దరఖాస్తుల స్వీకరణ
బీజేపీ కూడా సెప్టెంబర్ 4 నుండి 10వ తేదీ వరకు ఆశావహ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను చేపట్టనుంది. ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
దరఖాస్తులను స్వీకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించేవాళ్లు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాల్సి ఉంటుంది.