సీట్ల సర్దుబాటుపై 13 మందితో I.N.D.I.A. కూటమి కోఆర్డినేషన్ కమిటి.. సభ్యుల వివరాలు ఇవిగో!
- సెప్టెంబర్ 30లోపు సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకోనున్న కోఆర్డినేషన్ కమిటీ
- సభ్యుల్లో వేణుగోపాల్, పవార్, స్టాలిన్, రౌత్, తేజస్వి సహా వివిధ పార్టీల నేతలు
- లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని తీర్మానం
కాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఈ కూటమి కలిసి పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కూటమి తీర్మానం చేసింది. 'I.N.D.I.A. కూటమి పార్టీలమైన మేం, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వీలైనంత వరకు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. వివిధ రాష్ట్రాలలో సీట్ల భాగస్వామ్యం ప్రయత్నాలు తక్షణమే ప్రారంభమవుతాయి. సీట్ల పంపకాల్లో ఇచ్చిపుచ్చుకోవడంతో సహకార స్ఫూర్తితో వీలైనంత త్వరగా ముగిస్తాము' అని తీర్మానం చేశాయి.