రేపు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ఏపీ సీఎం జగన్
- తాజా సీజన్ కోసం సెప్టెంబరు 1న తొలి విడత పెట్టుబడి సాయం
- తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కనున్న సీఎం జగన్
- రూ.109.74 కోట్లు రైతుల ఖాతాల్లోకి బదిలీ
పీఎం కిసాన్ సమ్మాన్-వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రైతులకు ఏటా రూ.7,500 పెట్టుబడి సాయం కింద అందజేస్తోంది. ఇది మూడు విడతల్లో అందజేస్తున్నారు.
2023-24 వ్యవసాయ సీజన్ కు సంబంధించి తొలి విడత సాయాన్ని రేపు అందిస్తున్నారు. అందుకోసం రూ.109.74 కోట్లను సీఎం విడుదల చేయనున్నారు. 1.46 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.