నమాజ్ కోసం బస్ ఆపినందుకు విధుల నుంచి తొలగింపు.. కండక్టర్ ఆత్మహత్య
- యూపీలో తాజాగా షాకింగ్ ఘటన
- ఇద్దరు ప్రయాణికులు నమాజ్ చేసుకునేందుకు వీలుగా బస్ ఆపిన యూపీ ఆర్టీసీ కండక్టర్
- విషయం వెలుగులోకి రావడంతో జూన్‌లో విధుల నుంచి తొలగింపు
- ఫలితంగా మోహిత్ కుటుంబం ఆర్థికకష్టాల్లో కూరుకుపోయినట్టు ఆయన భార్య వెల్లడి
- సోమవారం కండక్టర్ రైలు కిందపడి ఆత్మహత్య
మానవత్వం ప్రదర్శించినందుకు తన భర్త భారీ మూల్యం చెల్లించుకున్నారని మోహిత్ యాదవ్ భార్య రింకీ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త వివరణను పరిగణనలోకి తీసుకోకుండానే విధుల నుంచి తొలగించారని ఆరోపించారు. ఎనిమిది మంది ఉన్న కుటుంబ బాధ్యత మొత్తం తన భర్తదేనని, ఆయనకొచ్చే 17 వేల జీతంపైనే యావత్ కుటుంబం ఆధారపడిందని ఆమె తెలిపింది.