ఇకపై గాళ్‌ఫ్రెండ్‌కు ముద్దుపెట్టేటప్పుడు జాగ్రత్త.. లేదంటే జరిగేది ఇదే!

 kiss with girlfriend leaves man with ruptured eardrum
  • కర్ణభేరి పగిలిపోయి వినికిడి సమస్య
  • చైనాలోని ఓ కుర్రాడికి ఎదురైన వింత అనుభవం
  • కోలుకునేందుకు రెండు నెలలు పడుతుందన్న వైద్యులు
  • గాఢ చుంబనం వలన చెవిలో గాలి పీడనంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటాయన్న వైద్యులు
ఇకపై ప్రియురాలిని చుంబించేప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే దానివల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు మరి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చైనాలో ఓ వ్యక్తి తన గాళ్‌ఫ్రెండ్‌ను పదినిమిషాలపాటు ముద్దుపెట్టుకున్నాడు. అంతే, అతడి కర్ణభేరి పగిలిపోయింది. ఫలితంగా చెవులు వినిపించడం మానేశాయి. ఈ మేరకు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది. 

ఆగస్టు 22న చైనా వేలంటైన్స్ డే నాడు ఈ ఘటన జరిగినట్టు పత్రిక తన కథనంలో పేర్కొంది. తూర్పు ఝెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెస్ట్‌లేక్‌లో ఓ జంట ప్రేమ మైకంలో మునిగిపోయి అదర చుంబనాలతో ప్రపంచాన్ని మర్చిపోయింది. సరిగ్గా పది నిమిషాల తర్వాత కుర్రాడు పాపం విలవిల్లాడిపోయాడు. ఎడమ చెవిలో నొప్పుగా ఉందని, చెవి నుంచి భయంకరమైన శబ్దం వస్తోందని చెప్పడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

పరీక్షించిన వైద్యులు అతడి కర్ణభేరి పగిలిపోయినట్టు గుర్తించారు. కోలుకునేందుకు  రెండు నెలలు పడుతుందని తీరిగ్గా సెలవిచ్చారు. ఉద్వేగభరితమైన అదర చుంబనం చెవి లోపల గాలి పీడనంలో వేగంగా మార్పులకు కారణమవుతుందని, ఈ కేసులో అదే జరిగిందని వైద్యులు వివరించారు. భాగస్వామి భారీ శ్వాసతో కలిసి కర్ణభేరి పగిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. సో.. ముద్దుపెట్టేటప్పుడు జాగ్రత్త సుమీ!
Go Back to Shorts
Kiss
China
Chinese Valentine's Day
Eardrum
Zhejiang Province

More Telugu News