ఆధార్ ఉచిత అప్ డేట్ కు సమీపిస్తున్న గడువు
- ఇప్పటికే పలుమార్లు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
- సెప్టెంబర్ 14 తో ముగియనున్న గడువు
- ఆ తర్వాత ఆధార్ లో మార్పులకు సొమ్ము చెల్లించాల్సిందే
ఇంట్లోనే ఆధార్ అప్ డేట్ ఇలా..
ఆధార్ నంబర్ ద్వారా మై ఆధార్ పోర్టల్ లోకి లాగిన్ అయి అడ్రస్ అప్ డేట్ ఆప్షన్ ఎంచుకుంటే మీ మొబైల్ కు ఓటీపీ వస్తుంది.. దానిని ఎంటర్ చేశాక డాక్యుమెంట్ అప్ డేట్ క్లిక్ చేస్తే ఆధార్ కార్డులోని మీ వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. ఆ వివరాలన్నీ సరిచూసుకుని, మార్పులు ఉంటే చేసి నెక్ట్స్ బటన్ పై క్లిక్ చేయాలి. అనంతరం మీరు చేసిన మార్పులను ధ్రువీకరించేందుకు అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తి చేశాక మీ మొబైల్ కు ఆధార్ అప్ డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ తో ఆధార్ అప్ డేషన్ ప్రాసెస్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటుంది.