రూ.8 కోట్లతో ప్రాపర్టీ కొనుగోలు చేసిన కాజోల్
- ముంబైలోని ఓషివారా ప్రాంతంలో కొనుగోలు
- 194 చదరపు అడుగులకు భారీ ధర
- ఈ ఏడాది ఏప్రిల్ లోనూ రూ.16 కోట్లతో ఆఫీస్ స్థలం కొనుగోలు
ఈ ఏడాది ఏప్రిల్ లో 2,493 చదరపు అడుగుల అపార్ట్ మెంట్ ను కాజోల్ రూ.16.50 కోట్లతో కొనుగోలు చేయడం తెలిసిందే. కాజోల్ భర్త అజయ్ దేవ్ గణ్ సైతం ఇటీవలే రూ.45 కోట్లతో ఐదు కార్యాలయ భవనాలను సొంతం చేసుకున్నారు. ఈ దంపతులు తమ ఆదాయంతో ఖరీదైన ఆస్తులు సమకూర్చుకుంటున్నట్టు వారి కొనుగోళ్లను పరిశీలిస్తే తెలుస్తుంది. కాజోల్ నెట్ ఫ్లిక్స్ ఆంథాలజీ, లస్ట్ స్టోరీస్ 2, ద ట్రయల్ లో కనిపిస్తుండడం తెలిసిందే.