Uttar Pradesh: కోడలిని చెరపట్టేందుకు ప్రయత్నించిన భర్తను గొంతుకోసి చంపేసిన మహిళ

UP Woman kills husband after he tries to sexually assualt daughter in law
షార్ట్స్‌లో చూడండి
కూతురు లాంటి కోడలిని వక్రబుద్ధితో చూస్తున్న భర్త తీరుతో విసిగిపోయిందో మహిళ. తనతో సంబంధానికి కోడలిని ఒప్పించాలంటూ భర్త రోజూ వేధిస్తుండటంతో ఆమెలో సహనం నశించి అతడి గొంతుకోసి చంపేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. బదాయూ పట్టణానికి చెందిన తేజేంద్ర సింగ్ తాళ్ల వ్యాపారి. అతడికి నలుగురు సంతానం. ఆగస్టు 14న అతడు తెల్లవారు జామున అనుమానాస్పద రీతిలో హత్యకు గురయ్యాడు. 

కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మృతుడి భార్య మిథిలేశ్ దేవిని ప్రశ్నించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో, ఆమెను కస్టడిలోకి తీసుకుని విచారించగా ఆమె దుఃఖం ఆపుకోలేక అసలు విషయం చెప్పేసింది. జితేంద్ర రోజు తాగి వచ్చి తనను కొట్టేవాడని, కొన్నేళ్లుగా ఈ నరకం భరిస్తూ వచ్చానని వెల్లడించింది. ఇటీవల అతడు కోడలిపై కన్నేశాడని చెప్పింది. తనతో లైంగిక సంబంధానికి కోడలిని ఒప్పించాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చేవాడని వెల్లడించింది. భర్త తీరుతో విసిగిపోయిన మిథిలేశ్‌దేవి చివరకు ఆగస్టు 13న రాత్రి భర్త తాగిన మైకంలో గాఢ నిద్రలో ఉండగా కొడవలితో అతడి గొంతు కోసి హత్య చేసింది.
Go Back to Shorts
Uttar Pradesh
Crime News

More Telugu News