కేసీఆర్‌కే ఓటేస్తామని కామారెడ్డిలో 10 గ్రామపంచాయతీల తీర్మానం

10 villages in Kamareddy will vote to KCR only
  • ఏకగ్రీవ తీర్మానం చేసిన మాచారెడ్డి మండలంలోని గ్రామాలు
  • తీర్మానానికి సంబంధించిన ప్రతులను కవితకు అందించిన మండల నాయకులు
  • కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు పట్టం కడతారన్న ఎమ్మెల్సీ కవిత
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. కామారెడ్డిలోని పది గ్రామాల ప్రజలు తాము కేసీఆర్‌కే ఓటు వేస్తామంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, నడిమి తండా, వెనుక తండ, బోడగుట్ట తండా, మైసమ్మచూరు, రాజకన్‌పేట, వడ్డెరగూడెం, గుండితండా, దేవునిపల్లి గ్రామాల పంచాయతీల్లో కేసీఆర్‌కు ఓటేస్తామంటూ తీర్మానం చేశారు. శనివారం మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత‌ నివాసంలో ఆమెను కలిసి సంబంధిత తీర్మాన ప్రతులను అందించారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... కేసీఆర్‌కు మాత్రమే ఓటేస్తామని తీర్మానం అద్భుతమన్నారు. షబ్బీర్ అలీ వంటి కాంగ్రెస్ నేతలు ఎన్ని మాట్లాడినా కేసీఆర్‌కు కామారెడ్డి ప్రజలు పట్టం కడతారని చెప్పారు. కామారెడ్డిలోని అన్ని గ్రామాల ప్రజలు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేయాలని నిర్ణయించారన్నారు.
Go Back to Shorts
KCR
Kamareddy District
BRS
Shabbir Ali
K Kavitha

More Telugu News