Mallikarjun Kharge: చేవెళ్ల ప్రజాగర్జన సభ: హైదరాబాద్ చేరుకున్న మల్లికార్జున ఖర్గే!

Mallikarjuna Kharge reaches hyderabad for praja garjana
  • శంషాబాద్ విమానాశ్రయం నుండి హోటల్‌కు మల్లికార్జున ఖర్గే
  • అక్కడి నుండి చేవెళ్ళ ప్రజాగర్జన సభకు ఏఐసీసీ అధినేత
  • సభలో దళిత, గిరిజన డిక్లరేషన్ ప్రకటన!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం సాయంత్రం ఐదు గంటల సమయానికి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ అధినేతకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. సాయంత్రం చేవెళ్లలో జరిగే కాంగ్రెస్ ప్రజాగర్జన సభలో ఖర్గే పాల్గొంటున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి హోటల్‌కు వెళ్లిన ఖర్గే, అక్కడి నుండి చేవెళ్ల సభ కోసం వెళ్తారు. ఈ సభలో దళిత, గిరిజన డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. చేవెళ్ల సభ అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి ఇక్కడే బస చేయనున్నారు.
Mallikarjun Kharge
Congress
Revanth Reddy
Mallu Bhatti Vikramarka

More Telugu News