Allu Arjun: పుష్ప ప్రైవేట్ పార్టీ ఇచ్చాడు!

Allu Arjun arranged private party for family members and close friends
  • పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా గుర్తింపు
  • తాజాగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం
  • అల్లు అర్జున్ ఇంట మిన్నంటుతున్న కోలాహలం
  • కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులకు ప్రైవేట్ పార్టీ 
పుష్ప చిత్రంలో నటనకు గాను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వరించడం తెలిసిందే. దాంతో అల్లు అర్జున్ ఇంట సందడి మామూలుగా లేదు. 

పుష్ప చిత్రంలో విలన్ ఫహాద్ ఫాజిల్ "పార్టీ లేదా పుష్పా?" అంటూ పలికిన డైలాగ్ ఎంతో పాప్యులరైంది. బన్నీకి నేషనల్ అవార్డు వచ్చిన నేపథ్యంలో అభిమానులు కూడా సోషల్ మీడియాలో "పార్టీ లేదా పుష్పా?" అని అడుగుతున్నారు. ఇప్పుడు నిజంగానే అల్లు అర్జున్ తన ఇంట ప్రైవేట్ పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా, ఈ పార్టీలో పుష్ప చేతిలో ఉండే గొడ్డలి, పుష్ప నడిపే లారీ ఆకారంలో డైనింగ్ టేబుల్స్ ఏర్పాటు చేయడం విశేషం. 'తగ్గేదే లే' అనే అక్షరాలను లైటింగ్ తో ప్రదర్శించారు.
Allu Arjun
Private Party
National Best Actor
Pushpa
Tollywood

More Telugu News