ఈ నెల 25న ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై రెండు బ్లాక్ బస్టర్ మూవీస్!
- ఈ నెల 25న ఓటీటీ సెంటర్స్ లో సందడి
- నెట్ ఫ్లిక్స్ లో 'బ్రో' సినిమా స్ట్రీమింగ్
- అదే రోజున 'ఆహా'లో అందుబాటులోకి 'బేబి'
- ఒక రోజు ముందుగానే అమెజాన్ ప్రైమ్ లో 'స్లమ్ డాగ్ హస్బెండ్'
సాయిరాజేశ్ దర్శకత్వంలో రూపొందిన 'బేబి' జులై 14వ తేదీన విడుదలైంది. వైష్ణవి చైతన్య .. ఆనంద్ దేవరకొండ .. విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, యూత్ నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దాదాపు 100 కోట్ల మార్కుకి చేరువగా ఈ సినిమా వెళ్లింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 25 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.ఇక పవన్ - సాయితేజ్ కాంబినేషన్లో సముద్రఖని తెరకెక్కించిన 'బ్రో'కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే - మాటలు అందించిన ఈ సినిమా, పవన్ ఫ్యాన్స్ ను హుషారెత్తించింది. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఈ నెల 25 నుంచి తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో 'నెట్ ఫ్లిక్స్' లో అందుబాటులోకి రానుంది. ఈ సినిమాలకి ఒక రోజు ముందే, అమెజాన్ ప్రైమ్ లో 'స్లమ్ డాగ్ హస్బెండ్' స్ట్రీమింగ్ కానుంది.