ఒకవేళ బీజేపీకి ఓటు వేయవద్దనుకుంటే నోటాకు వేయండి: ధర్మపురి అర్వింద్
- గజ్వేల్‌లో ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్న అర్వింద్
- బీఆర్ఎస్, మజ్లిస్ దోస్తీ మైనార్టీలకే నష్టమని వ్యాఖ్య
- మోదీ పాలనలో ముస్లీంలకు భద్రత పెరిగిందన్న ఎంపీ
నోటాకు ఓటు వేసినా, కారు గుర్తుకు ఓటేసినా, హస్తం గుర్తుకు ఓటేసినా తాను గెలవడం మాత్రం పక్కా అన్నారు. దేశవ్యాప్తంగా తాము 5 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చామని, ఇప్పటికే మూడున్నర కోట్ల ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. మరో 50 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పారు. పేదలకు ఇచ్చే ఇళ్ల విషయంలో కేసీఆర్ సర్కార్ వెనుకబడి ఉందన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మోసం చేస్తోందన్నారు.