Army Encounter: పుల్వామాలో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ సహా ఇద్దరి హతం

Two terrorists killed in Pulawama
షార్ట్స్‌లో చూడండి
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. పరిగామ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్టు నిఘావర్గాల నుంచి సమాచారం అందుకున్న భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన టెర్రరిస్టులు కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సైన్యం జరిపిన కాల్పుల్లో ఉగ్రవాదులు ఇద్దరు హతమైనట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి.

రెండు వారాల క్రితం రాజౌరీ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. అంతకుముందు ఈ నెల 5న కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. గాయపడిన మరో ముగ్గురు జవాన్లు చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Army Encounter
Jammu And Kashmir
Pulwama
Lashkar-e-Taiba

More Telugu News