శంషాబాద్ ఎయిర్ పోర్టులో రామ్ చరణ్... ఫొటోలు ఇవిగో!

Ram Charan spotted at Shamshabad airport
  • ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న రామ్ చరణ్ 
  • శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిత్రం
  • శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో గేమ్ చేంజర్ 
ఆర్ఆర్ఆర్ సమయంలోనే ప్రారంభమైన గేమ్ చేంజర్ చిత్రం ఇంకా షూటింగ్  జరుపుకుంటూనే ఉంది. అయితే ఇటీవల చిత్రబృందం షూటింగ్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. 

కాగా, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం పూర్తి సమయాన్ని కేటాయిస్తున్న చరణ్... తాజాగా షూటింగ్ కోసం వెళుతూ శంషాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరాల కంటబడ్డాడు. తనకిష్టమైన బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తుల్లో రామ్ చరణ్ లాంజ్ లోకి వెళుతూ దర్శనమిచ్చాడు. చేతిలో ల్యాపీ బ్యాగ్, కళ్లకు గాగుల్స్ తో ఉన్న రామ్ చరణ్... మీడియా ప్రతినిధులను చూడగానే చిరునవ్వుతో విష్ చేశాడు. 

పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. రామ్ చరణ్, కియారా జంటగా నటించడం ఇది రెండోసారి. వీరిద్దరూ గతంలో వినయ విధేయ రామ చిత్రంలోనూ జోడీగా నటించడం తెలిసిందే.
Go Back to Shorts
Ram Charan
Shamshabad Airport
Game Changer
Shankar
Dil Raju

More Telugu News