టీఎస్ఆర్టీసీ బిల్లును న్యాయసలహా కోసం పంపించిన గవర్నర్ తమిళిసై
- టీఎస్ఆర్టీసీ బిల్లుకు వారం రోజులు దాటినా ఆమోదం తెలపని గవర్నర్
- ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లుల్నీ న్యాయసలహా కోసం పంపిన గవర్నర్
- న్యాయశాఖ సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్న రాజ్ భవన్
టీఎస్ఆర్టీసీ బిల్లుకు వారం రోజులు దాటినా గవర్నర్ తమిళిసై ఆమోదం లభించలేదు. ఈ బిల్లు ద్వారా కార్మికులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్లు గవర్నర్ ఇదివరకే చెప్పారు. అయితే వారం గడిచినా గవర్నర్ ఆమోదించకపోవడంతో కార్మిక సంఘాలు ఈ రోజు అల్టిమేటం జారీ చేశాయి. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ నుండి స్పష్టత వచ్చింది.