కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేజ్రీవాల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన మోదీ

PM Modi wishes  Delhi CM Kejriwal on his birthday
  • ఈ రోజు 55వ పడిలోకి అడుగు పెట్టిన ఢిల్లీ సీఎం
  • కేజ్రీవాల్ దీర్ఘాయిష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని  మోదీ ట్వీట్
  • ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ఆప్ 
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జన్మదినం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కేజ్రీవాల్ ఈ రోజు 55వ పడిలో అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. ‘ఢిల్లీ సీఎం శ్రీ అరవింద్ కేజ్రీవాల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు దీర్ఘాయిష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు.

కాగా, ఇటీవల ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సందర్భంగా బీజేపీపై ఆప్ తీవ్ర విమర్శలు చేసింది. ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకించినప్పటికీ ఉభయ సభలు ఆమోదించిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు.
Advertisement
Narendra Modi
Delhi
Arvind Kejriwal
wishes
birthday

More Telugu News