మోదీ మాటలను జనాలు ఎవరూ వినే స్థితిలో లేరు: లాలూ ప్రసాద్ యాదవ్

No one will hear Modi says Lalu Prasad Yadav
  • ఎర్రకోటపై మోదీ జెండాను ఎగురవేయడం ఇదే చివరిసారి అన్న లాలూ
  • స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని వ్యాఖ్య
  • వారి సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదన్న లాలూ
ప్రధాని మోదీ చెప్పే బూటకపు మాటలను వినే స్థితిలో ప్రజలు లేరని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఢిల్లీలోని ఎర్రకోటపై మోదీ జెండాను ఎగుర వేయడం ఇదే చివరిసారని జోస్యం చెప్పారు. 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీలోని సర్క్యులర్ రోడ్డులో ఉన్న తన నివాసంలో లాలూ ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించడానికి ఎంతో మంది త్యాగాలు చేశారని, వారి సేవలను దేశం ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు నివాళి అర్పిస్తున్నామని చెప్పారు.
Go Back to Shorts
Lalu Prasad Yadav
RJD
Narendra Modi
BJP

More Telugu News