KCR: తెలంగాణ రైతులకు శుభవార్త... రూ.1 లక్ష లోపు రుణమాఫీ పూర్తి

Loan waiver to Telangana farmers
  • స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రైతులను మురిపించిన ప్రభుత్వం
  • నేడు ఒక్కరోజే 10వేలకు పైగా రైతుల రూ.6546 కోట్ల రుణాల మాఫీ
  • ఇప్పటివరకు మొత్తం రూ.7,753 కోట్ల రుణాల మాఫీ
రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు రైతులను మురిపించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.1 లక్షలోపు రుణాలను మాఫీ చేసినట్టు కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. నేడు... సోమవారం రోజున 10,79,721 మంది రైతులకు చెందిన రూ.6,546.05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. .
KCR
Telangana
farmer

More Telugu News